చెరువులో కుప్పలు తెప్పలుగా కొట్టుకొచ్చిన కాగితాలు.. ఏంటా అని తీసి చూడగా మైండ్ బ్లాక్
ఆధార్.. భారతదేశంలోని ప్రతీ పౌరుడికి అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు ఇది. ఏ పని జరగాలన్నా ముందు ఆధార్ ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్‌లు వేలాదిగా చెరువు గట్టుపై కుప్పలుగా కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమబెంగాల్ లోని తూర్పు బర్దమాన్ జిల్లాలో చెరువు పక్కన, వేల సంఖ్యలో ఆధార్ కార్డుల గుట్ట లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది.
ఆధార్.. భారతదేశంలోని ప్రతీ పౌరుడికి అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు ఇది. ఏ పని జరగాలన్నా ముందు ఆధార్ ఉండాల్సిందే. మరి అలాంటి ఆధార్‌లు వేలాదిగా చెరువు గట్టుపై కుప్పలుగా కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమబెంగాల్ లోని తూర్పు బర్దమాన్ జిల్లాలో చెరువు పక్కన, వేల సంఖ్యలో ఆధార్ కార్డుల గుట్ట లభ్యం కావడంతో స్థానికుల్లో తీవ్ర కలకలం రేగింది. పూర్వస్థలి-2 బ్లాక్‌లోని పీలా పంచాయతీ పరిధి లలిత్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చెరువు పక్కన పెద్దమొత్తంలో ఆధార్ కార్డులు పడి ఉన్నాయన్న స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో వీటిని ఎవరు పారవేశారో.. అసలు ఎందుకు ఇక్కడ పడేశారో.. అవి అసలైనవా లేదా నకిలీవా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా SIR ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన వెలుగుచూడడం పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. బీజేపీ మండల-3 ప్రధాన కార్యదర్శి దెబబ్రత మండల్ దీనిపై స్పందించారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన దోషులెవరో బయటపెట్టేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. పోలీసులు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారని.. తూర్పు బర్దమాన్ జిల్లా మేజిస్ట్రేట్ అయేషా రాణి చెప్పారు. అవి నిజమైనవా, నకిలీవా అనే విషయమై పూర్తి స్థాయి పరిశీలన జరుగుతోంది. దీనికి SIR ప్రక్రియతో ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ఐడెంటిటీ కార్డులకు సంబంధించిన విషయం మాత్రమే అని తేల్చి చెప్పారు. ఈ ఆధార్ కార్డులు ఖచ్చితంగా నకిలీవే అయ్యే అవకాశం ఉందని, పోలీసులు ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారని.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపన్ చటర్జీ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్వాతంత్రం వచ్చాక తొలిసారిగా వెలిగిన కరెంటు బుగ్గ
Rhino: కొమ్ములో విషం.. స్మగ్లర్లకు శాపం..
ఇంకా పట్టాలెక్కని వందే భారత్ స్లీపర్ రైళ్లు.. ఎందుకు లేటు
