Hyderabad: పెళ్లి కావడంలేదని యువతి ఆత్మహత్య.! ఎక్కువ చదువుకుందనే కారణం..

|

Jul 12, 2023 | 7:11 PM

ఆధునిక కాలంలో మహిళ ఎన్నో రంగాల్లో అభివృద్దిపధంలో దూసుకెళ్తోంది. పురుషులకు సాధ్యమనుకున్న ఎన్నో మహిళలు సాధించి చూపిస్తున్నారు. ఎంత అభివృద్ధి చెందినా కొందరు మాత్రం ఇంకా అబలగానే ఆలోచిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఎంతో భవిష్యత్తు ఉన్న ఓ ఎమ్మెస్‌ స్టూడెంట్‌..

హైదరాబాద్‌కు చెందిన శ్రేయారెడ్డి సిబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో బీటెక్‌ పూర్తిచేసింది. ఎమ్మెస్‌ చదవాలనే కోరికతో యూఎస్‌లో ఓ మంచి యూనివర్శిటీలో ఎమ్‌ఎస్‌ సీటు కూడా పొందింది. గత డిసెంబర్లో హైదరాబాద్కు వచ్చిన శ్రేయ రెడ్డికి తల్లి దండ్రులు పెళ్లి చేయాలనుకున్నారు. పెళ్లి సంబంధాలు కూడా చూశారు. తమకంటే ఎక్కువ చదివిన అమ్మాయి మాకొద్దు అంటూ చాలామంది పెళ్ళికి నిరాకరించారు. ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి సెట్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది శ్రేయ రెడ్డి. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోడియం నైట్రేట్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రేయా రెడ్డి చనిపోవడం తో తను ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్కపిల్ల గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అది విని శ్రేయ తలిదండ్రులు అక్కడికి వెళ్లి చూసారు. తలుపు లోపలి నుండి బిగించి ఉండటంతో బద్ధలు కొట్టి లోపలకు వెళ్లిన వారు షాక్‌ తిన్నారు. విగత జీవి గా పడి ఉన్న శ్రేయ రెడ్డి నీ చూసి బావురుమన్నారు. హాస్పిటల్ కు తరలించే లోపే శ్రేయ మృతి చెందింది.. తమ కూతురి ఆత్మహత్యకు పెళ్లి సెట్ కాకపోవడమే కారణమని శ్రేయ రెడ్డి తండ్రి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న నర్సింగ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...