swiggy burqa: స్విగ్గీ బుర్ఖా మహిళ ఫొటో వైరల్‌.. అసలు కథేంటంటే.. ఆ బ్యాగ్ లో ఉంది అవే అంటూ..

|

Jan 26, 2023 | 9:15 AM

బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలినడకన 20 కిలోమీటర్ల దాకా ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ


బుర్ఖా ధరించి, స్విగ్గీ బ్యాగ్ వేసుకొని, కాలి నడకన వెళ్తున్న ఓ మహిళ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలినడకన 20 కిలోమీటర్ల దాకా ప్రయాణించి ఫుడ్ డెలివరీ చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారం చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ ఫొటోకు సంబంధించి అసలు నిజం బయటపడింది. అసలు ఆమె స్విగ్గీ డెలివరీ ఏజెంట్ కాదని, ఓ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోందని తేలింది. ఫొటోలో బుర్ఖా ధరించిన మహిళ పేరు రిజ్వానా. లక్నోలో నివాసం ఉంటోంది. ఇటీవల తన ఫొటో వైరల్ అయిందని తెలుసుకున్న ఆమె.. తన మాటల్లోనే తన కథ చెప్పింది. తాను ఇళ్లలో పనిచేస్తూ 1500 రూపాయలు సంపాదిస్తున్నానని తెలిపింది. మధ్యాహ్నం మార్కెట్ లోని స్టాల్స్ లో డిస్పోజబుల్ గ్లాసెస్, దుస్తులను విక్రయిస్తానని, ఒక గ్లాస్ ప్యాకెట్ అమ్మితే తనకు .2 రూపాయలు వస్తాయని చెప్పింది. అలా నెలకు 5 నుంచి 6వేలు సంపాదిస్తానని రిజ్వానా చెప్పింది. నలుగురు పిల్లలున్న కుటుంబ పోషణకు ఆ మొత్తం ఏ మాత్రం సరిపోదని వాపోయింది. భర్త రిక్షా తొక్కేవాడని, ఒక రోజు ఎవరో దాన్ని దొంగిలించడంతో ఉన్న ఆధారాన్ని కోల్పోయామని చెప్పింది. ఓ రోజు భిక్షాటనకు వెళ్లిన తన భర్త.. మళ్లీ తిరిగి రాలేదని, ప్రస్తుతం ఒక గది అద్దెకు తీసుకొని అత్తమామలతో కలిసి జీవనం సాగిస్తున్నానని వివరించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Published on: Jan 26, 2023 09:15 AM