Crime: ప్రియుడి మోజులో భర్త హత్యకు భార్య కుట్ర.! వేట కొడవలితో ప్లాన్.!
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రేయసి కోసం భార్యను, ప్రియుడికోసం భర్తను, లేదంటే పిల్లలను దారుణంగా హతమార్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించాలనుకుంది. ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు వేట కొడవలి పట్టుకొని తిరుగుతున్న ప్రియుడిని అరెస్ట్ చేసి హత్య కుట్రను భగ్నం చేశారు తాడిపత్రి పోలీసులు.
వివాహేతర సంబంధాలు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రేయసి కోసం భార్యను, ప్రియుడికోసం భర్తను, లేదంటే పిల్లలను దారుణంగా హతమార్చుతున్నారు. ఇటీవల ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాం. తాజాగా ఓ మహిళ ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే హత్య చేయించాలనుకుంది. ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు వేట కొడవలి పట్టుకొని తిరుగుతున్న ప్రియుడిని అరెస్ట్ చేసి హత్య కుట్రను భగ్నం చేశారు తాడిపత్రి పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తాడిపత్రిలోని RDT కాలనీకి చెందిన సౌభాగ్య, నాగరాజు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల సౌభాగ్యకు ఫేస్‌బుక్‌లో భాస్కర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఓరోజు తన ప్రియుడిని భర్త నాగరాజుకు పరిచయం చేసింది. ఈ క్రమంలో తన భార్యతో భాస్కర్ చనువుగా ఉండటం చూసాడు నాగరాజు.
దీంతో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయడానికి ప్లాన్ చేసింది సౌభాగ్య. ప్రతిరోజూ ఉదయం నాగరాజు సిగరెట్ల కోసం దగ్గర్లోని బంకు దగ్గరకు వెళ్తుంటాడు. ఇదే అదనుగా అతన్ని హతామార్చాలనుకున్న భాస్కర్ వేట కొడవలి తీసుకొని దారిలో కాపుకాసాడు. స్థానికులనుంచి సమాచారం అందుకున్న తాడిపత్రి రూరల్ సీఐ లక్ష్మీకాంత రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనివద్దనుంచి వేటకొడవలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..