Viral Video: వీధుల్లో తిరుగుతూ సర్పంచ్ చేసిన పనికి జనం ఫిదా..! ప్రభుత్వం దిగిరావాల్సిందే..
తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా ప్రజాప్రతినిధులే తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ పారిశుధ్య కార్మికుడి అవతరమెత్తాడు. గ్రామ పంచాయతీ కార్మికులు...
తెలంగాణ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను స్వయంగా ప్రజాప్రతినిధులే తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా మునుగోడు సర్పంచ్ పారిశుధ్య కార్మికుడి అవతరమెత్తాడు. గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగడంతో గ్రామాల్లోని చెత్తా, చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయింది. దీంతో సర్పంచ్ మిర్యాల వెంకన్న తానే పారిశుధ్య కార్మికుడిగా మారి.. ట్రాక్టర్ నడుపుతూ వీధిల్లో తిరుగుతూ చెత్తను సేకరించారు. వర్షాకాలంలో గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తూ చెత్తను తరలిచిన సర్పంచ్ ను పలువురు అభినందించారు. కాగా పంచాయతీ సిబ్బంది తమను పర్మినెంట్ చేస్తూ కనీస వేతనం 19 వేలు చెల్లించాలంటూ జులై 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...