Viral: గ్రామ దేవతకు బలి ఇచ్చేందుకు సిద్దం చేసిన దున్నపోతు.. అంతలోనే మాయం.
సాధారణంగా గ్రామ దేవతకు పూజలు, జాతరలు నిర్వహిస్తూ జంతుబలిని ఇస్తుంటారు. మేకలు, కోళ్లు తదితర జీవులను దేవతలకు బలి ఇస్తుంటారు. అలా ఓ గ్రామస్తులు తమ గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు ఓ దున్నపోతును పెంచుతున్నారు. జాతర సమయానికి దేవతకు బలిఇవ్వాలని సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఆ దున్నపోతు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఏమైపోయిందా అని అందరూ కంగారు పడ్డారు. చుట్టుపక్కల అనేక చోట్ల వెతికారు.
సాధారణంగా గ్రామ దేవతకు పూజలు, జాతరలు నిర్వహిస్తూ జంతుబలిని ఇస్తుంటారు. మేకలు, కోళ్లు తదితర జీవులను దేవతలకు బలి ఇస్తుంటారు. అలా ఓ గ్రామస్తులు తమ గ్రామదేవతకు బలి ఇచ్చేందుకు ఓ దున్నపోతును పెంచుతున్నారు. జాతర సమయానికి దేవతకు బలిఇవ్వాలని సిద్ధం చేస్తున్నారు. ఇంతలో ఆ దున్నపోతు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. ఏమైపోయిందా అని అందరూ కంగారు పడ్డారు. చుట్టుపక్కల అనేక చోట్ల వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అయ్యో అది మామూలు దున్నపోతు కాదే.. అమ్మవారికోసం సిద్ధం చేస్తున్నామే.. ఏమైపోయి ఉంటుందని ఇప్పుడు ఏం జరుగుతుందోనని గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. చివరికి నాలుగు రోజుల తర్వాత ఓ పాడుబడిన బావిలో ఆ దున్నపోతు దర్శనమిచ్చింది. దాంతో గ్రామస్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం మండలం నారాయణపురం పాడుబడ్డ బావిలో దున్నపోతును గుర్తించిర స్థానికులు, గ్రామస్తులు అంత కలిసి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. కానీ వారివల్ల కాలేదు. దాంతో విషయం గ్రామసర్పంచ్ తలారి వెంకటేశులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దున్నపోతును బయటకు తీసేందుకు క్రేన్‌ను తెప్పించారు. దాని సహాయంతో గ్రామస్తులంతా కలిసి దున్నపోతును ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. గ్రామ దేవత కొల్లాపురమ్మకు బలి ఇచ్చేందుకు గ్రామస్థులంతా కలిసి ఈ దున్నపోతును గ్రామంలో వదిలారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..