Mountaineer: వేల అడుగుల ఎత్తునుంచి పడిపోయిన పర్వతారోహకుడు.. అయినా ఏమీ కాలేదు..
ఆయుష్షు ఉండాలే కానీ మృత్యువు అంచులవరకూ వెళ్లినా ప్రాణాలతో బయటపడొచ్చని ఈ ఘటన రుజువుచేస్తోంది. అవును, ఓ పర్వతారోహకుడు వేల అడుగుల ఎత్తునుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని పర్వతసానువుల్లో సెప్టెంబర్ 9న జరిగింది. నార్త్ ఐలాండ్‌లోని టరనకీ పర్వతంపైకి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల వరకూ చేరుకున్నారు.
ఆయుష్షు ఉండాలే కానీ మృత్యువు అంచులవరకూ వెళ్లినా ప్రాణాలతో బయటపడొచ్చని ఈ ఘటన రుజువుచేస్తోంది. అవును, ఓ పర్వతారోహకుడు వేల అడుగుల ఎత్తునుంచి జారిపడినా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని పర్వతసానువుల్లో సెప్టెంబర్ 9న జరిగింది. నార్త్ ఐలాండ్‌లోని టరనకీ పర్వతంపైకి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల వరకూ చేరుకున్నారు. ఇంతలో ఓ పర్వతా రోహకుడు అక్కడినుంచి అనూహ్యంగా జారి పడిపోయాడు. అందరూ అతని ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ స్పల్పగాయాలతో బతికి బయటపడ్డాడు. అక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా అతడు పడిన చోట మంచు మెత్తగా మారడంతో అతను ప్రాణాలతో ఉన్నాడని అధికారులు తెలిపారు. ఇది అద్భుతమైన విషయమని, అతడు చాలా అదృష్టవంతుడని పోలీసులు అంటున్నారు. న్యూజిలాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటిగా పేర్కొంటారు. ఇదే ప్రాంతం నుంచి 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి మృతి చెందారు. నార్త్ ఐలాండ్‌లోనే నిద్రాణ అగ్నిపర్వతం కూడా ఉంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్లుగా దూరంగా ఉంటుంది ఈ పర్వతం. అంతేకాదు, తీరానికి సమీపంలో ఉండటం, వేగంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడం వంటి పరిస్థితులు న్యూజిలాండ్‌లో టరనాకీ వద్దతప్ప మరెక్కడా లేవని మౌంటెన్ సేఫ్టీ కౌన్సిల్ పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..