Mother kills Son: 19ఏళ్ళ కొడుకును చంపిన తల్లి.. విచారణలో విస్తుపోయే వాస్తవాలు..! వీడియో..

|

Sep 08, 2023 | 4:44 PM

బెజవాడలో దారుణం చోటు చేసుకుంది.19 ఏళ్ల కన్నకొడుకుని తల్లే కడతేర్చింది. అతి కిరాతకంగా పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆపై విషయం హైడ్రామా నడిపింది. ఆగస్టు నెలాఖరున చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. చివరికి ఆ తల్లి కటకటాల పాలైంది. విజయవాడ చిట్టినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

బెజవాడలో దారుణం చోటు చేసుకుంది.19 ఏళ్ల కన్నకొడుకుని తల్లే కడతేర్చింది. అతి కిరాతకంగా పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆపై విషయం హైడ్రామా నడిపింది. ఆగస్టు నెలాఖరున చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. చివరికి ఆ తల్లి కటకటాల పాలైంది. విజయవాడ చిట్టినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్లు కనిపెంచినా తల్లే కొడుకుని కాటికి పంపింది. ఆ తర్వాత కొడుకు దేవా కుమార్ చనిపోయాడంటూ తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందు కోసం పెద్ద కథనే అల్లింది. ఫుల్‌గా మద్యం తాగి వచ్చిన దేవా.. ఇంట్లో ఉన్న మైనర్ చెల్లి, తల్లితో గొడవ పడ్డాడు. గ్యాస్ సిలిండర్ లీక్ చేసి.. ఇంటికి నిప్పు పెట్టి చంపేస్తానని బెదిరించాడు. దీంతో కొడుకుని ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయామని, తెల్లవారు జామున వచ్చి చూసేసరికి కొడుకు విగతజీవిగా మారాడని ఫిర్యాదులో పేర్కొంది. దాంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. తల్లి ఆడిన డ్రామాతో పోలీసులే షాక్ అయ్యారు. అది సాధారణ మరణం కాదని తల్లే హత్య చేసినట్లు తేల్చారు. కొడుకుపై ఫిర్యాదు చేసిన తల్లి అదే రోజు రాత్రి మైనర్ కూతురుతో పాటు మరో వ్యక్తితో కలిసి ఊపిరి ఆడకుండా హత్య చేసింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకు తరుచు వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగిపోయిన తల్లి.. పక్కా ప్లాన్ తో కొడుకుని కిరాతకంగా హత్య చేసింది. ఆ విషయం బయటపడకుండా ఎంత జాగ్రత్త పడ్డ చివరికి కటకటాల పాలవ్వక తప్పలేదు. తల్లి, కూతురుతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..