Four Phones: నాలుగు ఫోన్లు మింగిన ఘనుడు..! కడుపు నొప్పితో ఆస్పత్రికి.. మైండ్ బ్లోయింగ్ వీడియో..

|

Sep 14, 2022 | 9:35 AM

అతడు తీహార్ జైలు ఖైదీ. ఇటీవల పెరోల్‌పై బయటకు వెళ్లి తిరిగివచ్చాడు. వచ్చిన 3 రోజుల తర్వాత అతడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యేలా

నాలుగు ఫోన్లు మింగిన ఘనుడు.. ! కడుపు నొప్పితో ఆస్పత్రికి .. - TV9
అతడు తీహార్ జైలు ఖైదీ. ఇటీవల పెరోల్‌పై బయటకు వెళ్లి తిరిగివచ్చాడు. వచ్చిన 3 రోజుల తర్వాత అతడికి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మైండ్ బ్లాంక్ అయ్యేలా అతడి కడుపులో 4 సెల్‌ఫోన్స్ కనిపించాయి. వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి రెండు మొబైల్ ఫోన్లు బయటకు తీయగా, మరో రెండు మొబైల్స్ కోసం త్వరలో మరో ఆపరేషన్‌ నిర్వహించనున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇతర ఖైదీలకు విక్రయించాలని భావించి.. 5 సెం.మీ కంటే చిన్నసైజులో 4 మొబైల్ ఫోన్‌లను ఖైదీ మింగేశాడు. కడుపులో నొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో ప్రాణభయంతో అతడు విషయాన్ని అధికారులకు చెప్పాడు. కానీ ఎవ్వరూ అతడిని నమ్మలేదు. కామెడీ చేస్తున్నావా అంటూ సీరియస్ అయ్యారు. నొప్పితో అతడు విలవిల్లాడుతూ ఉండటంతో.. వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎండోస్కోపీ చేసి, అతని కడుపులో ఒకటి కంటే ఎక్కువ ఫోన్‌లు ఉన్నాయని గ్రహించారు. బుధవారం శస్త్రచికిత్స చేసి.. 2 సెల్ ఫోన్లను రిమూవ్ చేశారు. మిగిలిన రెండు ఫోన్‌లు పొత్తికడుపుకు చేరుకున్న క్రమంలో.. స్పెషలిస్ట్‌ టీమ్ మరో సర్జరీ చేయనుందని తీహార్ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 14, 2022 09:35 AM