Kid Dance Video: టీవీ చూస్తూ… పుష్పాని దించేసిన బుడ్డోడు..! పలు రకాల కామెంట్లు చేస్తున్న నెటిజన్లు..(వీడియో)

Updated on: Mar 23, 2022 | 9:13 AM

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశమంతా పుష్ప మేనియా కొనసాగుతోంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్ల వరకు అందరూ పుష్ప సినిమా డైలాగులు,


అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశమంతా పుష్ప మేనియా కొనసాగుతోంది. ఫ్యాన్స్ దగ్గర నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్ల వరకు అందరూ పుష్ప సినిమా డైలాగులు, పాటలకు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేస్తున్నారు. వీటితో సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. ఇదిలా ఉంటే.. ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి సాంగ్ ఒక్క తెలుగులోనే కాదు.. అన్ని భాషల్లో హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బన్నీ వేసిన సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. నెట్టింట ఎక్కడ చూసినా బన్నీ సిగ్నేచర్ స్టెప్‌ వీడియోలే కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఈ పాటకు స్టెప్పులు వేసేస్తున్నారు. తాజాగా ఓ బుడ్డోడు అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేస్తూ ‘శ్రీవల్లి’ పాటకు స్టెప్పులు వేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో .. ఒక ఇంట్లో కొందరు టీవీ చూస్తున్నారు. టీవీలో శ్రీవల్లి పాట ప్లే అవుతోంది. అది చూస్తూ ఓ బుడ్డోడు టీవీకి దగ్గరగా వచ్చాడు. ఇక బన్నీ సిగ్నేచర్ స్టెప్ రాగానే.. బుడ్డోడు భుజాన్ని పైకెత్తి చూడండి.. ఈ స్టెప్‌ నేనూ చేయగలను అన్నట్టుగా టీవీవైపు చూపిస్తూ అచ్చం బన్నీలాగే హుక్‌ స్టెప్‌ వేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఈ వీడియోను లక్షలమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. “ఓర్నీ… పుష్పాని దించేసాడుగా” అంటూ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)