Girlfriend – Boyfriend: ప్రియుడుని మరువలేక.. తరలిరాని లోకాలకు ప్రియురాలు.. వీడియో.

|

Aug 24, 2023 | 8:57 PM

ఇంకా ప్రేమ పేరుతో చక్కని భవిష్యత్తును యువత నాశనం చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకుంటే ప్రియుడ్ని మర్చిపోలేక ప్రియురాలు కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యానాంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక అనే యువతికి ఓ అక్క, చెల్లి ఉన్నారు.

ఇంకా ప్రేమ పేరుతో చక్కని భవిష్యత్తును యువత నాశనం చేసుకుంటున్న ఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ప్రేమించిన యువకుడు గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకుంటే ప్రియుడ్ని మర్చిపోలేక ప్రియురాలు కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా యానాంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. యానాంలోని యూకేవీనగర్‌కి చెందిన మీసాల మౌనిక అనే యువతికి ఓ అక్క, చెల్లి ఉన్నారు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితం చనిపోయారు. మౌనిక తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్‌ కాలేజీలో నర్సింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమె అక్క, చెల్లెలు వివాహాలై అత్తవారిళ్లలో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండేళ్లుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలోఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం తన సోదరుణ్ణి 500 రూపాయలు అడిగాడు. అందుకు అతను నిరాకరించడంతో సోదరుడు డబ్బులివ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అప్పట్నుంచి మౌనిక కాలేజ్‌కి వెళ్లడం మానేసింది. గదిలో ఒంటరిగా ఉంటూ చిన్నా జ్ఞాపకాలతో మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో ఆగస్టు 21న ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకుంది. మేనమామ త్రిమూర్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి మృతదేహానికి ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఘటనపై ఎస్సై నూకరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...