Viral: లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!

|

Oct 13, 2024 | 11:50 AM

కళ్లెదుటే కన్నబిడ్డ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. బిడ్డ నిద్రపోతున్నాడనే భ్రమలో ఆస్పత్రిలోని బెడ్‌పై చిన్నారి మృతదేహం పక్కనే పడుకొని జోకొడుతూ.. కన్నయ్యా.. లేనాన్నా.. ఇంటికి వెళ్లిపోదాం.. ఎంతసేపు బజ్జుంటావు నాన్నా అంటుంటే ఆ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడుకు చెందిన బాబూరామ్, శిరీష దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు కాగా మూడేళ్ళ చిన్నోడు ఇటీవల అనారోగ్యానికి గురవడంతో పిల్లలిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాజంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ అదుపు తప్పి అందరూ కింద పడిపోయారు. ముందు భాగంలో కూర్చున్న పెద్ద కుమారుడు ఐదేళ్ల శ్యామ్‌ఎగిరి రోడ్డుపై పడటంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిబ్బంది శ్యామ్‌ మృతదేహాన్ని ఆసుపత్రిలో బెడ్‌పై ఉంచగా తల్లి శిరీష ఆ పక్కనే పడుకుని.. కన్నయ్యా ఎంత సేపు పడుకుంటావు నిద్రలే అని పిలుస్తూ భ్రమలోనే ఉండిపోయారు. బాలుడి తండ్రి ఆమెను సముదాయించేందుకు ప్రయత్నించినా పిల్లాడు నిద్రలేచాకే ఇంటికి వెళదామని చెప్పడంతో ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on