Crocodile Viral Video: ఇసుకలో సేదదీరుతున్న మొసలి.. దగ్గరకి వెళ్లి చూస్తే షాక్..! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా.. క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారుతోంది. ఇక జంతువుల వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. మనం మొసలిని దూరం నుంచి చూస్తేనే వణికిపోతాం. అలాంటిది దగ్గరకెళ్లి చూస్తే ఇంకేమైనా ఉందా.. పై ప్రాణం పైనే పోతుంది. తాజాగా ఓ సముద్ర తీరం దగ్గర పే..ద్ద మొసలి హాయిగా సేదదీరుతోంది. దాన్ని చూసేందుకు జనాలు దగ్గరకి వెళ్లారు. ఇంకేముంది ఒక్కసారిగా వారికి బిగ్ షాక్ తగిలింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టిం వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న జస్ట్ సెకెన్ల నిడివిగల ఈ వీడియోలో ఒక బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో ఓ వ్యక్తి సముద్రపు ఒడ్డున మొసలి రూపంలో శాండ్ ఆర్ట్ వేశాడు. అది అచ్చం ప్రాణమున్న మొసలిలాగే కనిపిస్తోంది. అది ఒక గొయ్యి లాంటి ప్రదేశంలో రిలాక్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అది చూస్తే ఎవరికైనా దగ్గరకు వెళ్లి చూడాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ఆ సైకత శిల్పం. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతటి కళాఖండాన్ని సృష్టించిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షల కొద్దీ లైకులు, వ్యూస్ వచ్చి పడుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోను చూసేయండి..
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..