Cloud Cap: టోపీలా మారే మేఘాన్ని ఎప్పుడైనా చూశారా.? మైండ్ పోయే విజువల్స్.. చూస్తూ ఉండిపోతారు అంతే..
తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుంది అందమైన ప్రకృతి. అందమైన ప్రదేశాలనే కాదు, అద్భుత విషయాలకు కూడా నెలవు. ప్రకృతిలో జరిగే విశేషాలను చూస్తుంటే ఔరా అనక మానదు. ఒకప్పుడు ఇలాంటి వింతలు కేవలం చూసిన వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే
తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుంది అందమైన ప్రకృతి. అందమైన ప్రదేశాలనే కాదు, అద్భుత విషయాలకు కూడా నెలవు. ప్రకృతిలో జరిగే విశేషాలను చూస్తుంటే ఔరా అనక మానదు. ఒకప్పుడు ఇలాంటి వింతలు కేవలం చూసిన వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడం, అందరికీ ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. ఇక ఇలాంటి ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మంచు దుప్పటితో కప్పబడి ఉన్న ఓ పర్వతంపై మేఘం గుండ్రంగా ఏర్పడింది. పర్వత శిఖరంపై అచ్చంగా టోపీ పెట్టినట్లు ఉన్న ఈ మేఘం కొండ చుట్టూ గిరగిరా తిరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. ఇదిలా ఉంటే మేఘాలు ఇలా ఏర్పడడాన్ని లెంటిక్యులర్ క్లౌడ్ లేదా టోపీ మేఘం అంటారు. ఈ మేఘాలు సాధారణంగా పర్వతాలపైనే ఏర్పడతాయి. అమేజింగ్ నేచర్ అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!