రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

|

Jul 14, 2022 | 5:56 PM

ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో చూస్తుంటాం.. వన్య ప్రాణులు, వాటి జీవన పోరాటం తదితర వీడియోను నెటిజన్లను బాగా ఆకట్లుకుంటాయి.

ప్రతిరోజూ జంతువులకు సంబంధించిన అనేక వీడియోలను సోషల్‌ మీడియాలో చూస్తుంటాం.. వన్య ప్రాణులు, వాటి జీవన పోరాటం తదితర వీడియోను నెటిజన్లను బాగా ఆకట్లుకుంటాయి. తాజాగా అటవీ ప్రాంతలోని ఓ రోడ్డుపై వెళ్తున్న పులి కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అయ్యోపాపం అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో సానుభూతి ప్రకటిస్తున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో అటవీ ప్రాంతంలోని ఓ రోడ్డును దాటుతున్న ఓ పెద్ద పులిని అటువైపు వేగంగా వస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది. పాపం ఆ దెబ్బతో పులి అంత దూరం ఎగిరి పడింది. అయితే అదృష్ట వశాత్తు పులికి పెద్దగా ప్రమాదం జరిగినట్లు లేదు. పడిన వెంటనే లేచి ప్రాణాలు పంజాతో పట్టుకొని అడవిలోకి పరుగు తీసింది. ఈ ఘటన మ‌లేషియాలో చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాపం పులిగి దెబ్బలు బాగానే తగిలి ఉంటాయి.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!

Published on: Jul 14, 2022 05:56 PM