Maharastra: 15 ఏళ్ల బాలిక దారుణం.. యూట్యూబ్‌లో చూసి స్వయంగా కాన్పు చేసుకున్న బాలిక.. వీడియో.
అక్రమ సంబంధాలు అనర్థాలకు హేతువులుగా మారుతున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలోని నాగర్‌పూర్ నగరంలో ఓ 15 ఏళ్ల బాలిక చేసిన పని అందరినీ
అక్రమ సంబంధాలు అనర్థాలకు హేతువులుగా మారుతున్న ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలోని నాగర్‌పూర్ నగరంలో ఓ 15 ఏళ్ల బాలిక చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూట్యూబ్‌లో చూసి స్వయంగా కాన్పు చేసుకోవడమే కాకుండా.. పుట్టిన ఆ పసికందును గొంతునులిపి చంపేసింది. స్థానిక అంబజారీ ప్రాంతానికి చెందిన ఓ బాలికకు సోషల్ మీడియా ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి, ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. బాలిక శరీరంలో మార్పులను గమనించిన తల్లి కూతురిని నిలదీసింది. అనారోగ్యం వల్లే తన పొట్ట పెరిగిందంటూ అప్పటికి తప్పించుకుంది. తర్వాత స్వయంగా కాన్పు ఎలా చేసుకోవాలో సోషల్ మీడియాలో సెర్చ్ చేసింది. అలా మార్చి 2వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుక్షణం ఆ శిశువును గొంతు నులిమి చంపేసి, మృతదేహాన్ని ఓ పెట్టెలో దాచిపెట్టింది. ఇంతలో బయటకు వెళ్లిన తల్లి తిరిగి వచ్చి కూతురి పరిస్థితిని గమనించి నిలదీసింది. దాంతో అసలు విషయం తల్లికి చెప్పింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపినట్లు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Naatu Naatu Song in Oscar 2023: వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్ ఫీవర్.. ప్రపంచ వేదికపై తెలుగోడి సత్తా..
Allu Arjun – Shah Rukh Khan: షారుఖ్‌కు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బన్నీ.. వీడియో.
Allu Arjun: అర్జున్ రెడ్డి 2.O.. వచ్చేస్తున్నాడు పాన్ ఇండియా మూవీ.. కాస్కోండి మరి..!