Lion attack girl: సింహం దాడిలో తీవ్రంగా గాయపడిన తొమ్మిదేళ్ళ చిన్నారి.. చివరకి గెలిచి నిలిచిందిగా..
అమెరికాలో తొమ్మిదేళ్ల చిన్నారి లిల్లీ క్రైజానివిస్కీ కౌగర్ దాడిలో తీవ్రంగా గాయపడి .. ఆస్పత్రిలో కోలుకుంటుంది. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి
అమెరికాలో తొమ్మిదేళ్ల చిన్నారి లిల్లీ క్రైజానివిస్కీ కౌగర్ దాడిలో తీవ్రంగా గాయపడి .. ఆస్పత్రిలో కోలుకుంటుంది. ఐదు రోజుల కిందటి వరకు ఆమె జీవితం మిగతా వాళ్లలాగే సరదాగా గడిచింది. కానీ, ఇప్పుడు ఆమె ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో పడి ఉంది. మౌంటెన్ లయన్ దాడి చేస్తే మనుషి బతకడం చాలా కష్టం. అలాంటి స్థితిలో గాయపడి.. బతకడం లిల్లీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. లిల్లీ కుటుంబం వెస్ట్రన్ యునైటెడ్ స్టేట్స్‌కు విహారయాత్రకు వెళ్లింది. అధికారులను హెచ్చరికలను ఆ కుటుంబాలు పట్టించుకోలేదు. పిల్లలను ఆడుకోవడానికి బయటకు పంపించారు. అక‍్కడే స్నేహితులతో ఆడుకుంటున్న టైంలో.. ఆ చిన్నారిపై కౌగర్ దాడి చేసింది. ముఖంతో పాటు మొత్తం ఆ చిన్నారిని చీల్చి పడేసింది. నోట కరుకుకుని లాక్కుని పోయింది. ఆ హఠాత్ పరిణామంతో తోటి పిల్లలు గట్టి గట్టిగా అరిచారు. అంతా వచ్చి చూసేసరికి రక్తపు మరకలు తప్ప బిడ్డ కనిపించలేదు.అంతా కలిసి వెతకగా.. కొద్దిదూరంలో రక్తపు మడుగులో పడి ఉంది ఆ చిన్నారి దేహం. అధికారుల సాయంతో వెంటనే లిల్లీని ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, శరీర పైభాగం దాడిలో ఘోరంగా దెబ్బతింది. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకునేందుకు ఆ కుటుంబానికి డబ్బు అవసరం పడింది. అందుకే ఆమె అంకుల్ గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరించారు. చిన్నారి పరిస్థితిని ఫొటోల ద్వారా చూసి చలించి.. విరాళాలు వెల్లువెత్తాయి. మొత్తానికి సోమవారం సర్జరీ జరిగింది. ఐసీయూ నుంచి, అంతకు మించి కోమా నుంచి లిల్లీ బయటకు వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!