60 ఏళ్లలో 96 లీటర్ల రక్తం దానం.. 80 ఏళ్ల మహిళ గిన్నిస్‌ రికార్డ్‌

|

Apr 01, 2023 | 9:40 AM

రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రక్తమే కీలకం. ప్రస్తుత కాలంలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం. ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే రక్తమే కీలకం. ప్రస్తుత కాలంలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు, కొందరు సెబ్రిటీలు ఆయా సందర్భాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి బ్లడ్‌ బ్యాంకుల ద్వారా అవసరమైనవారికి అందిస్తుంటారు. రక్తదానం గొప్పతనం గురించి తెలుసుకున్న ఓ మహిళ 96 లీటర్ల రక్తం దానం చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కారు. కెనడాకు చెందిన జోసెఫీన్‌ మిచాలుక్‌ అనే 80 ఏళ్ల మహిళ తన 22వ ఏటనుంచి రక్తదానం చేస్తున్నారు. జోసెఫీన్‌ సోదరి రక్తదానం ప్రాముఖ్యత గురించి చెప్పి ప్రోత్సహించడంతో అప్పటినుంచి క్రమం తప్పకుండా రక్త దానం చేస్తున్నట్టు ఆమె చెప్పారు. ఇప్పటి వరకూ సుమారు 203 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. అంటే ఇది 96 లీటర్లకు సమానం. అందుకే జోసెఫీన్‌ గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ లెక్కలేనంతమదిని తన రక్తంతో బ్రతికించారని గిన్నిస్‌ రికార్డ్‌ అధికారులు పేర్కొన్నారు. 1955లో తొలిసారిగా జోసెఫీన్‌ రక్తదానం చేశారు. తనపేరుతో ఓ రికార్డు ఉంటుందని తానెప్పుడూ ఊహించలేదని, తాను రికార్డుల కోసం రక్తం దానం చేయలేదని చెప్పారు. 80 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న తాను ఇకపై కూడా రక్తదానాన్ని కొనసాగిస్తానన్నారు. జోసెఫీన్‌ బ్లడ్‌ గ్రూప్‌ ‘ఓ’ పాజిటివ్‌. అమెరికా రెడ్ క్రాస్ నివేదిక ప్రకారం..అమెరికా జనాభాలో 37 మందిది ఇదే బ్లడ్‌ గ్రూప్‌. దాంతో అక్కడ ఈ బ్లడ్‌ గ్రూప్‌కు డిమాండ్ ఎక్కువే అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెల్లికి కట్నంగా రూ.8 కోట్లు ఇచ్చిన అన్నలు !!

Follow us on