Nellore: నెల్లూరు జిల్లాలో రోడ్డు టెర్రర్ ఏడుగురు.. మృతి,20 మందికి గాయాలు.

|

Feb 11, 2024 | 11:03 AM

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర మూడు వాహనాలు ఢీ కొన్నాయి.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, అలాగే బస్సు డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే చనిపోయారు.

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముసునూరు టోల్‌ప్లాజా దగ్గర మూడు వాహనాలు ఢీ కొన్నాయి.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సును లారీ ఢీకొట్టింది. మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ బస్సు లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, అలాగే బస్సు డ్రైవర్‌ కూడా స్పాట్‌లోనే చనిపోయారు. ఈ ఘటనలో లారీ, బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి.. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా.. 20 మందికి గాయాలయ్యాయి..పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు..గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..కావేరి ట్రావెల్స్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. ఘోర ప్రమాదం జరిగిన ఘటన తర్వాత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాద పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారాయన. ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..