60 Snakes: బాబోయ్.. ఓ ఇంట్లో ఒకేసారి బయటపడ్డ 60 పాములు.. దిమ్మతిరిగిపోయే వీడియో.
బిహార్‌లోని రోహ్తాస్ పట్టణంలో ఒకే ఇంట్లో 50 నుంచి 60 పాములు కనిపించడం కలకలం రేపింది. అగ్‌రోఢ్ ఖుర్ద్ గ్రామంలోని ఇంట్లో ఈ పాములు కనిపించాయి. ఈవరుసగా ఒక్కో పాము ఇంట్లో నుంచి బయటకు వచ్చాయని ఆ ఇంటి యజమాని కృపానారాయణ్ పాండే తెలిపారు.
బిహార్‌లోని రోహ్తాస్ పట్టణంలో ఒకే ఇంట్లో 50 నుంచి 60 పాములు కనిపించడం కలకలం రేపింది. అగ్‌రోఢ్ ఖుర్ద్ గ్రామంలోని ఇంట్లో ఈ పాములు కనిపించాయి. ఈవరుసగా ఒక్కో పాము ఇంట్లో నుంచి బయటకు వచ్చాయని ఆ ఇంటి యజమాని కృపానారాయణ్ పాండే తెలిపారు. వచ్చిన పాములను వచ్చినట్టే దాదాపు రెండు డజన్ల వరకు చంపారు. ఇంకా పాములు బయటపడుతూనే ఉండటంతో అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు సహాయక బృందాలతో కలిసి గురువారం ఆ పాములను పట్టుకున్నారు. ఇంటి గోడలు, ఫ్లోరింగ్ పగులగొట్టి సుమారు 30 పాములను బయటకు తీశారు. ఇవన్నీ ఇండియన్ కోబ్రా జాతికి చెందినవని పాములను రక్షించిన అమర్ గుప్తా తెలిపారు. రెండంతస్తుల తమ ఇంటిని 1955లో నిర్మించినట్లు కృపానారాయణ్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...