Chocolate Taste Job: చాక్లెట్‌ రుచి చూసే వారికి నెలకు 6 లక్షలు..! అదిరిపోయే జాబ్‌ నోటిఫికేషన్‌..

|

Aug 02, 2022 | 9:09 AM

చదివిన చదువుకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు యువత ఎంతో కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగి కోసం అంతే శ్రమిస్తాయి.


చదివిన చదువుకు నచ్చిన ఉద్యోగం పొందేందుకు యువత ఎంతో కష్టపడి అనుకున్నది సాధిస్తారు. అదే సమయంలో కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగి కోసం అంతే శ్రమిస్తాయి. ఒక్కోసారి కొన్ని ఉద్యోగాలు భలే తమాషాగా ఉంటాయి. వీటికి కూడా జీతం ఇస్తారా అనిపిస్తుంటుంది.తాజాగా అమెరికాకు చెందిన సం‍స్థ అలాంటి జాబ్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఆ జాబ్‌ ఏంటో తెలుసా? ఆఫీస్‌లో కూర్చొని తినడమే. పైగా భారీ ఎత్తున శాలరీ పే చేసేందుకు సిద్ధమైంది. ఆ..ఏంటీ..తినేందుకు జాబ్‌.. పైగా అందుకు కళ్లు చెదిరిపోయే శాలరీ ఇస్తారా అని ఆశ్చర్యపోకండి.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర అమెరికాలో అతిపెద్ద ఆన్‌లైన్ క్యాండీ రిటైలర్.. కాండీ ఫన్‌హౌజ్‌ తమ సంస్థకి చీఫ్ కాండీ ఆఫీసర్ పోస్ట్‌ కోసం ఉద్యోగి కావాలని నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు ఈ కంపెనీలో తయారయ్యే చాక్లెట్‌ను రుచి చూసి రేటింగ్‌ ఇస్తే చాలు. ఇందుకు అర్హతగా 21 ఏళ్ళు దాటి ఉండాల్సిన అవసరం లేదు.. ఐదేళ్ళ బుడతలైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తూ చేసుకోవచ్చని తెలిపింది. ఎంపిక కాబడిన వారికి ఏడాదికి 1 లక్ష డాలర్లు జీతంతో పాటు డెంటల్‌ ఖర్చులు ఫ్రీ అని తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us on