Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌.! అధికారుల ప్రకటన..

Updated on: Nov 10, 2024 | 3:33 PM

తెలంగాణ తిరుమలగా భావించే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ ఆలయాన్ని గత ప్రభుత్వం 1200 కోట్లతో పునర్నించింది. అద్భుతమైన కట్టడాలతో ఆకట్టుకునేలా, అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన ఈ ఆలయంలో నాణ్యతా లోపాలు బయటపడతున్నాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఫ్లోరింగ్ మరోసారి కుంగిపోయింది.

కొద్దిపాటి వానకే నిర్మాణ లోపాలు బయటపడుతున్నాయి. తాజాగా దక్షిణ భాగం ప్రాకార మండప తిరువీధుల్లో 50 మీటర్ల మేర రెండు అంగుళాల లోతు వరకు ఫ్లోరింగ్‌ కుంగిపోయింది. గత ప్రభుత్వం 1.20 ఎకరాలు ఉన్న కొండను పూర్తిగా చదును చేయడంతో ప్రధాన ఆలయ ప్రాంగణం 4.20 ఎకరాలకు విస్తరించింది. ఈ ప్రాంగణంలో స్వామివారి ప్రధానాలయంతో పాటు సప్తగోపురాలను నిర్మించారు. ఆలయం దక్షిణ భాగంలోని ప్రాకార మండపంలో వేసవిలో భక్తుల కాళ్ల కింద వాడిన మ్యాట్లు, వంట చెరకు వేయడంతో చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు ఇసుక నిండిపోయి కోతులకు ఆవాసంగా మారింది. అదేవిధంగా రిటైనింగ్‌ వాల్‌కు ఒక చోట బండలు ఊడిపోయాయి. ఆలయ పునర్మిర్నాణంలో దక్షిణ భాగంలో మట్టితో విస్తరించగా ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ సుమారు 50 మీటర్ల పొడవున రెండు అంగుళాల లోతుకు కుంగింది. విస్తరణ సమయంలోనూ ఇదే ప్రదేశంలో కుంగిపోగా అప్పట్లో మరమ్మతులు చేపట్టారు.

రెండేళ్ల క్రితం కురిసిన కొద్దిపాటి వానకే ప్రధాన ఆలయంలోని దక్షిణ రాజ గోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బండలు దాదాపు 10 మీటర్ల మేర 3 ఇంచుల కిందకి కుంగాయి. రాతిబండలు తొలగించి మరమ్మత్తులు చేశారు. గట్టినేల వచ్చే వరకు బోర్‌వెల్‌తో రంధ్రాలు చేసి అందులో సిమెంట్, కాంక్రీట్‌తో నింపారు. వాటిపై బండలతో ఫ్లోరింగ్ వేశారు. మరమ్మత్తులు చేసి రెండేళ్లు కూడా కాకముందే మళ్లీ ఫ్లోరింగ్ కుంగడంతోపాటు నాపరాళ్లు పగిలి మరోసారి నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. అయితే ఈ నిర్మాణ లోపాలతో ప్రధానాలయానికి ఎటువంటి డోకా లేదని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us