ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. బయటపడ్డ..
గుప్త నిధులు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. వాటి దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నారు. కానీ ఓ దినసరి కూలీ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా..
గుప్త నిధులు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. వాటి దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా మాయమవుతున్నారు. కానీ ఓ దినసరి కూలీ చేసిన పనికి అందరూ శభాష్ అంటున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా.. బ్రిటిష్ కాలంనాటి వెండి నాణేలు బయటపడ్డాయి. వాటిని ఇంటికి తీసుకెళ్లి, తానే దాచుకోవాలని అనుకున్నారు. ఓ రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. చివరికి మానవత్వంతో ఆలోచించి.. వాటిని ప్రభుత్వానికి అప్పగించారు. దమోహ్ జిల్లా బదల్‌పుర గ్రామానికి చెందిన హల్లె అహిర్వార్ ఓ పాత ఇంటి వద్ద తవ్వినపుడు 1887వ సంవత్సరంనాటి 240 వెండి నాణేలు దొరికాయి. వీటిని చూసిన హల్లె షాక్ అయ్యాడు. వాటిని తన వద్దనే ఉంచుకోవాలని మొదట భావించినప్పటికీ, చివరికి పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ వెండి నాణేల విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: అదిరిపోయిన ఆదిపురుష్ 3D ట్రైలర్
Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. మే11న ఉస్తాద్ వస్తున్నాడు
Shakuntalam: శాకుంతలం రిజెల్ట్ బాధించింది
Chiranjeevi: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరు.. ఖుషీ నడుము సీన్ రిపీట్
Andhra Pradesh: టీచర్ ఉద్యోగం కోసం కౌన్సిలర్ పోస్టుకు రాజీనామా !!