Elephant drink: ఫుల్లుగా తాగేసి గాఢనిద్ర.. మనుషులు కాదు ఏనుగులు..! వీడియో చూస్తే షాకే..

ఇప్పటివరకు మనుషులు మాత్రమే మ‌ద్యం సేవించ‌డం చూశాం. ఇటీవ‌ల ఓ కోతి కూడా బీర్ బాటిల్స్‌ను దొంగిలించి తాగిన వార్త విన్నాం.. తాజాగా ఆ జాబితాలోకి గజరాజులు వ‌చ్చి చేరాయి. నీళ్లు అనుకొని నాటుసారాను తాగేశాయి 24 ఏనుగులు.

Elephant drink: ఫుల్లుగా తాగేసి గాఢనిద్ర.. మనుషులు కాదు ఏనుగులు..! వీడియో చూస్తే షాకే..

|

Updated on: Nov 12, 2022 | 9:30 PM


ఇప్పటివరకు మనుషులు మాత్రమే మ‌ద్యం సేవించ‌డం చూశాం. ఇటీవ‌ల ఓ కోతి కూడా బీర్ బాటిల్స్‌ను దొంగిలించి తాగిన వార్త విన్నాం.. తాజాగా ఆ జాబితాలోకి గజరాజులు వ‌చ్చి చేరాయి. నీళ్లు అనుకొని నాటుసారాను తాగేశాయి 24 ఏనుగులు. ఆ త‌ర్వాత గాఢ నిద్రలోకి జారుకున్నాయి. ఒడిశాలోని కియోన్‌జార్ జిల్లాలోని శిలిప‌డా గ్రామానికి చెందిన కొంద‌రు వ్యక్తులు స‌మీప అడ‌వుల్లో నాటుసారాను త‌యారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవ‌ల గ్రామ‌స్తులు కొంద‌రు అడ‌విలో కొన్ని ర‌కాల పువ్వుల‌ను సేక‌రించి కుండ‌ల్లో పులియ‌బెట్టారు. అయితే అటుగా వచ్చిన ఏనుగులు.. ఆ ద్రావ‌ణం నీరు అనుకొని తాగేశాయి. ఇంకేముంది ఆ ఏనుగుల‌కు మ‌త్తెక్కింది. 24 ఏనుగులు ఒకే చోట గాఢ నిద్రలోకి జారుకున్నాయి. మ‌రుస‌టి రోజు తెల్లవారుజామున 6 గంట‌ల స‌మ‌యంలో గ్రామ‌స్తులు అడ‌విలోకి వెళ్లారు. నాటుసారా త‌యారీలో భాగంగా పులియ‌బెట్టిన పువ్వుల కుండ‌లు ప‌గిలిపోయి ఉన్నాయి. వీటికి కొద్ది దూరంలోనే ఏనుగుల గుంపు నిద్రలోకి జారుకున్న దృశ్యాలను గ‌మ‌నించారు. ఏనుగులే ఈ ద్రావ‌ణాన్ని తాగి ఉంటాయ‌ని గ్రామ‌స్తులు భావించారు. దీంతో వారు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. గాఢ నిద్రలోకి జారుకున్న ఏనుగుల‌ను అట‌వీ అధికారులు అక్కడ్నుంచి పంపించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Follow us