Rajasthan: 17 మంది మనవళ్లు, మనుమరాళ్లకు ఒకేసారి పెళ్లి.! తాత ప్లాన్ అదుర్స్.

|

Apr 09, 2024 | 10:18 PM

లాల్​మదేసర్​ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్​ గోదారా ఉన్నారు. సూర్జారామ్​ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్​ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు.

రాజస్థాన్​ బీకానేర్​ జిల్లాలో ఓ వృద్ధుడు తన 17 మంది మనుమరాళ్ల, మనుమళ్ల పెళ్లి ఒకేసారి చేశారు. ఒక్క రోజు గ్యాప్‌లో వారి సామూహిక వివాహం జరిపించారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా జరిగింది ఇదే. లాల్​మదేసర్​ గ్రామంలో గ్రామ పెద్దగా సూర్జారామ్​ గోదారా ఉన్నారు. సూర్జారామ్​ వారసులంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. అయితే ఆ కుటుంబంలో పెళ్లికి ఎదిగిన సూర్జారామ్​ మనుమళ్లు, మనుమరాళ్లు 17మంది ఉన్నారు. వీరందరికీ విడివిడిగా వివాహం జరిపించడం ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నారో ఏమో కానీ, అందరికీ ఒకేసారి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే పక్కా ప్లాన్​ వేసుకుని వారందరి పెళ్లిళ్లకు ఒకే ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. అనంతరం బంధువులను పిలిచి ఐదుగురు మనుమళ్లకు సోమవారం ఏప్రిల్ 1వ తేదీన పెళ్లి చేశారు. మరుసటి రోజు 12మంది మనుమరాళ్లకు వివాహం జరిపించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇలా ఒకే ఇంట్లో సామూహిక వివాహాలు జరగడం ఈ ప్రాంతంలో ఇదే మొదటి సారి అని స్థానికులు మీడియాకు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..