150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. ఫైన్ రూ.19 లక్షలు.. కానీ షాకింగ్ ట్విస్ట్!

Updated on: Aug 07, 2026 | 4:15 PM

ఆస్ట్రేలియాలో 1870లో లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన పుస్తకం 150 ఏళ్ల తర్వాత తిరిగి గ్రంథాలయానికి చేరింది. ఇంటి పునరుద్ధరణ సమయంలో చిమ్నీలో దొరికిన ఈ అరుదైన పుస్తకాన్ని వారసుడు నిజాయితీగా అప్పగించాడు. నిబంధనల ప్రకారం రూ.19 లక్షల జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ, అతని నిజాయితీని మెచ్చిన అధికారులు పూర్తి ఫైన్‌ను మాఫీ చేశారు.

ఎప్పుడో 150 ఏళ్ల క్రితం లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన ఒక పుస్తకాన్ని, ఒక పాఠకుడి వారసుడు తిరిగి గ్రంథాలయానికి అప్పగించిన విచిత్ర సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. తమ ఇంటి పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో, చిమ్నీలోని ఒక పాత చెక్కపెట్టెలో ఈ అరుదైన పుస్తకం లభ్యమైంది. దానిని పరిశీలించగా తమ పూర్వీకులు 1870లో లైబ్రరీ నుంచి తెచ్చుకున్నట్లు తేలింది. పుస్తకాన్ని ఇంట్లోనే ఉంచుకోవడం కంటే తిరిగి అప్పగించడమే సరైనది అని భావించి, ఆ వ్యక్తి దానిని గ్రంథాలయ అధికారులకు అందజేశాడు. అంత పురాతన రికార్డులు ప్రస్తుతం తమ వద్ద లేవని తెలిపిన లైబ్రరీ నిర్వాహకులు, పుస్తకాన్ని సంతోషంగా స్వీకరించారు. అయితే లైబ్రరీ నిబంధనల ప్రకారం 150 ఏళ్లకు గానూ జరిమానా లెక్కిస్తే దాదాపు రూ. 19 లక్షలు అవుతుందని అధికారులు లెక్కగట్టారు. కానీ, ఆ వ్యక్తి నిజాయితీని మెచ్చి ఆ ఫైన్‌ను పూర్తిగా మినహాయించారు. ఇకపై ఈ పుస్తకాన్ని ఎవరికీ ఇచ్చేది లేదని, మళ్లీ ఇంకో 150 ఏళ్లు ఎదురుచూడలేమని గ్రంథాలయ నిర్వాహకులు సరదాగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్‌

ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్‌ లైట్లు

ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి

ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!

Loading...
Unable to load recommendations.
Follow Us