“రామకథను వినరయ్యా” అంటూ 14 యేళ్ల బాలిక రూ. 52 లక్షలు విరాళం
సూరత్‌కు చెందిన14 ఏళ్ల బాలిక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చింది. రామ కథలను చదివి, వాటిని చెబుతూ పలు ప్రదర్శనలు ఇచ్చింది. తన 10 ఏళ్ల వయస్సు నుంచి రామ కథలు చెబుతూ సేకరించిన విరాళాలను అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరళంగా అందించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని తెలుసుకుంది.
సూరత్‌కు చెందిన14 ఏళ్ల బాలిక అయోధ్యలోని శ్రీరామ మందిరానికి ఏకంగా రూ.52 లక్షలు విరాళంగా ఇచ్చింది. రామ కథలను చదివి, వాటిని చెబుతూ పలు ప్రదర్శనలు ఇచ్చింది. తన 10 ఏళ్ల వయస్సు నుంచి రామ కథలు చెబుతూ సేకరించిన విరాళాలను అయోధ్య రామమందిరం నిర్మాణానికి విరళంగా అందించింది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భవికా మహేశ్వరి అనే 14 ఏళ్ల బాలిక అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోందని తెలుసుకుంది. అందుకు ప్రజలు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారనే విషయం బాలిక చెవిన పడింది. అంతే.. తానూ ఆలయానికి విరాళం అందించాలని అనుకుంది. అప్పటి నుంచి బాలరాముడి కథలు చదవడం ప్రారంభించింది. తాను చదివిన కథలను కొవిడ్ ఐసోలేషన్ సెంటర్లు, లాజ్‌పూర్ జైలు, బహిరంగ సభల్లో ప్రజలకు చెప్పింది. 2021లో లాజ్‌పూర్ జైలులో ఉన్న దాదాపు 3200 ఖైదీలకు రాముడి కథలను చెప్పగా వారు రూ.లక్ష విరాళంగా ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అబ్బురపరుస్తున్న శ్రీరామ కళారూపాలు.. 600 రూబిక్ క్యూబ్స్‌తో శ్రీరాముని రూపం
20 వేల నాణాలతో అయోధ్య రామ మందిరం
దేశంలోనే అరుదైన శస్త్ర చికిత్స.. వ్యక్తికి చేయి మార్పిడి