Viral Video: 14 అడుగుల గిరి నాగును చాకచక్యంగా బంధించారు.. దీని గురించి ఈ విషయాలు తెల్సా..?

|

Aug 18, 2023 | 4:47 PM

మగ, ఆడ గిరినాగులు.. సంవత్సరంలో 4 నెలల పాటు అంటే మార్చి నుంచి జూన్ నెలల మధ్య సంగమిస్తాయి. మగ గిరి నాగులను ఆకర్షించడానికి గిరి నాగులు ప్రయత్నిస్తాయి. దీనికోసం ఆడ గిరినాగు.. ఫెరామోన్స్ అనే ఒక విధమైన రసాయనాన్ని తన బాడీ నుంచి వెదజల్లుతుంది. ఆ వాసనే మగ గిరి నాగులను అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఆ వాసన వచ్చిన చోటుకు అవి వెదుక్కుంటూ వెళ్తాయి. ఈ క్రమంలో ఆడ పాములను అనుసరిస్తాయి. వేసవి కాలంలో అడవుల్లో కాని నీటి వనరులు తగ్గిపోతే అవి నీటి కోసం చెమ్మను వెదుక్కుంటూ పొలాల్లోకి వచ్చేస్తాయి.

గిరినాగు విషం చాలా ప్రమాదకరం. ప్రాణాంతకం. మెదడుపై అత్యంత దుష్పభ్రావం చూపిస్తుంది. గిరినాగు కాటేస్తే బతికే ఛాన్స్‌ కేవలం 25 శాతం మాత్రమే. కంటపడితే వెంటపడ్డాల్సిన పని వుండదు.పడగెత్తిన కింగ్‌ కోబ్రాను చూస్తే పై ప్రాణాలు పైనే ఇక. ఓ రకంగా చూపులతోనే చంపేస్తాయివి. కాటు కన్నా గిరినాగు కాటేసిందనే భయమే ప్రాణాలు తీస్తుంది. సర్పజాతిలో గిరినాగు భిన్నమైంది. దీని పొడువు పది నుంచి 20 అడుగులపైనే ఉంటుంది. ఒంటిపై నల్లటి చారలుంటాయి. ఎక్కువగా దట్టమైన అడవుల్లోనే ఉంటాయి. జనవాసాల్లోకి అంతగారావు.కానీ అడవులు మాయం కావడంతో ఇటీవల పులులు పల్లెబాట పడుతున్నాయి.అదే తరహాలో ఆహార వేటలో గిరినాగులు జనవాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో గురువారం ఓ ఇంటి పైకప్పు నుంచి 14 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రాను రెస్క్యూ చేశారు.  దాదాపు 8 కిలోల బరువున్న విషసర్పాన్ని తీసుకువెళ్లి కపిలాష్ అభయారణ్యంలోకి వదిలారు. భారీ విషసర్పం ఆహారం వెతుక్కుంటూ గ్రామంలోకి ప్రవేశించి ఉండొచ్చని  బన్యాక్ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.