పెంపుడు కుక్క దాడిలో.. బాలుడిపై మొహంపై 200 కుట్లు

Updated on: Sep 14, 2022 | 8:50 PM

పిట్‌ బుల్ జాతికి చెందిన కుక్క 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. దాడిలో బాలుడి మొహానికి 200 కుట్లు పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది.

పిట్‌ బుల్ జాతికి చెందిన కుక్క 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. దాడిలో బాలుడి మొహానికి 200 కుట్లు పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. తన ఇంటి దగ్గర్లోని పార్క్‌లో ఆడుకుంటున్న బాలుడిపై పెంపుడు పిట్ బుల్ కుక్క దాడి చేసింది. దాడిలో బాలుడి ముఖానికి దాదాపు 200 కుట్లు పడ్డాయి. ఘటనకు సంబంధించిన సన్నివేశం అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. కుక్క బాలుడిపై తీవ్రంగా విరుచుకుపడటం కనిపించింది. ఓ బాలిక కుక్కను తీసుకొని పార్కులో నడుస్తుండగా.. అకస్మాత్తుగా పిల్లవాడిపై దాడి చేసింది. ఈ సమయంలో ఒక వ్యక్తి పరుగున వచ్చి పిల్లవాడిని రక్షించాడు. అప్పటికే.. పిల్లవాడు పుష్ప్ త్యాగి ముఖంలోని కొంత భాగాన్ని కుక్క కొరికేసినట్లు స్థానికులు వెల్లడించారు. దీనిపై అధికారులు చర్యలు చేపట్టారు. కుక్క యజమానికి రూ. 5,000 జరిమానా విధించారు. కాగా.. యూపీలో పెంపుడు కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. ఘజియాబాద్‌, నోయిడాలోని హౌసింగ్ సొసైటీ లిఫ్ట్‌లలో కుక్కలు దాడి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Traffic Challan: ఇదేం ఫైన్ మావ.. చలాన్ చూసి స్టన్ అయిన వాహనదారుడు !!

స్కూలుకి లేట్‌గా వచ్చారని టాయ్‌లెట్స్‌ కడిగించిన ప్రిన్సిపల్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

అమ్మబాబోయ్.. పిడుగు పడటాన్ని కళ్లారా ఎప్పుడైనా చూశారా ?? వీడియో చూస్తే గుండె గల్లంతే

Digital News Round Up: ఊపేస్తున్న తార్‌మార్‌ సాంగ్‌ | రష్మికను దించేసిన చిన్నారి..లైవ్ వీడియో

TOP 9 ET News: స్పై యాక్షన్ డ్రామా ది ఘోస్ట్ 12 యాక్షన్ సీన్స్ |పొన్నియన్ సెల్వన్ నుంచి సాంగ్ విడుదల

Published on: Sep 14, 2022 08:50 PM
Loading...
Unable to load recommendations.
Follow Us