West Godavari: అన్నదానంలో 32 వంటకాలు.. పదార్థాల పేర్లు విన్నా నోరూరిపోతుంది..

| Edited By: శివలీల గోపి తుల్వా

Oct 03, 2023 | 10:57 AM

భగవంతుడి పేరిట భోజనాలు పెట్టడం, ఆహుతులు సంత‌ప్తిగా తినేలా రకరకాల పదార్థాలు వడ్డించటమనే విధానాన్ని మనం పూర్వీకుల నాటి నుంచే ఆచరిస్తున్నాం. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదానం మరి ప్రత్యేకంగా మారింది. మొత్తం 32 రకాల వంటకాలను వడ్డించి ఘనంగా అన్నదానం నిర్వహించారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు..

పశ్చిమ గోదావరి జిల్లా, అక్టోబర్ 03: ‘వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఓహ్హోహో నాకే ముందు’.. మాయా బజార్ సినిమాలో యస్వీ రంగారావు ఈ పాటకు అద్భుతంగా నటించారు. ఇప్పటికీ చాలా హోటల్స్‌లో ఆయన గెటప్‌తో ప్లేట్ నిండా ఆహార పదార్ధాలతో ఉన్న ఫోటోలు కనిపిస్తుంటాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం మాత్రమే కాదు.. అది మనిషి జిహ్వ చాపల్యం. ఈ కారణంగానే భగవంతుడి పేరిట భోజనాలు పెట్టడం, ఆహుతులు సంత‌ప్తిగా తినేలా రకరకాల పదార్థాలు వడ్డించటమనే విధానాన్ని మనం పూర్వీకుల నాటి నుంచే ఆచరిస్తున్నాం. ఈ క్రమంలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన అన్నదానం మరి ప్రత్యేకంగా మారింది. మొత్తం 32 రకాల వంటకాలను వడ్డించి ఘనంగా అన్నదానం నిర్వహించారు గ్రామస్తులు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం గుమ్ములూరులో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాలలో భాగంగా అన్నదానం కూడా ఏర్పాటు చేసారు గ్రామస్తులు. ఏకంగా 32 రకాల వంటకాలతో అన్నదానం చేసారు. బూరెలు, చెక్కర పొంగలి, జాంగ్రీ, బజ్జీ, సమోసా, పులావ్, పులిహోర, అప్పడం, 8 రకాల స్వీట్స్, మరో 5 రకాల హాట్స్, కూరలు, పచ్చళ్ళు, పండ్లు, ఐస్ క్రీమ్‌తో కలిపి మొత్తం 32 రకాల పదార్థాలను వడ్డించారు. అక్కడే తినలేని వాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు కవర్లను కూడా అందించారు. ఇలా గణనాధుని పేరిట చేసిన అన్నదానంలో సుమారు నాలుగు వేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఘనంగా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.

Published on: Oct 03, 2023 10:57 AM