Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం
దేశంలో మరో వందే భారత్ స్లీపర్ రైలు త్వరలో బెంగళూరు-ముంబై మధ్య ప్రారంభం కానుంది. ఈ రైలు 22 గంటల ప్రయాణ సమయాన్ని 16 గంటలకు తగ్గిస్తుంది. రైల్వే శాఖ లక్ష్యం ప్రకారం, ఈ ఏడాది చివరి నాటికి మరిన్ని వందే భారత్ రైళ్లు రానున్నాయి. బెంగాల్-అస్సాం స్లీపర్ విజయవంతం కావడంతో, దక్షిణ భారతదేశానికి కూడా ఈ సౌకర్యం విస్తరిస్తుంది.
దేశంలో మరో వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుంది. త్వరలోనే బెంగళూరు-ముంబై నగరాల మధ్య స్లీపర్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో 22 గంటల ప్రయాణ సమయం కాస్తా.. 16 గంటలకు తగ్గనుంది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా మరో 12 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం ప్రవేశపెట్టిన అత్యాధునిక వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. 2019 నుంచి దశల వారీగా వందకు పైగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది కేంద్రం.. ఆ తర్వాత స్లీపర్ రైళ్ల తయారీని చేపట్టింది. కొన్ని నెలల క్రితం.. తొలి వందే భారత్ స్లీపర్ రైలును బెంగాల్-అస్సాం మధ్య ప్రారంభమైంది. ఈ వందే భారత్ స్లీపర్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో.. దేశంలోని మిగిలిన దూర ప్రాంతాలకు కూడా ఈ రైలును అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈసారి దక్షిణాదికి వందేభారత్ స్లీపర్ రైలును ఆమోదించింది. ముంబై నుంచి బెంగళూరుకు స్లీపర్ రైలును నడపనుంది. అయితే ఈ బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు కు సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రాలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏ మార్గంలో నడుస్తుంది.. ఏ ఏ స్టేషన్లలో ఆగుతుంది.. టికెట్ ధర ఎంత అనే సమాచారాన్ని రైల్వే శాఖ త్వరలోనే బయటపెట్టనుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి ముంబైకి సుమారు 1,134 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే.. 22 గంటలు పడుతుండగా.. ఈ వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే.. అది కేవలం 16 గంటల్లోనే చేరుకుంటుంది. 3 నెలల క్రితం అస్సాం నుంచి బెంగాల్ మధ్య మొదలైన వందే భారత్ స్లీపర్.. కేవలం 119 ట్రిప్పుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. ఇందులో ఏకంగా 1.21 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం
గ్రామంలో వరుసగా మరణిస్తున్న కోతులు.. ఆందోళనలో గ్రామస్తులు
ఈ ఏడాది వర్షాలు తక్కువేనట.. వ్యవసాయంపై ఆందోళన
పుట్టిన రోజునే మృత్యు ఒడికి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
AP Heatwave Alert: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. వాతావరణ శాఖ బిగ్ అలర్ట్
