Viral Video: వరద బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. షాకింగ్ వీడియో చూస్తే..
మంగళవారం ఉదయం వర్షం ఆగిపోయిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో మూడు గ్రామాలను కలిపే లీలాం-పాటన్ రహదారిపై మూసుకుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది దూరంలో ఇలా జరగడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు.
చైనా, నేపాల్ సరిహద్దులో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్‌లోని మున్సియారిలోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న లీలామ్‌లో మంగళవారం ఉదయం వర్షం ఆగిపోయిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడడంతో మూడు గ్రామాలను కలిపే లీలాం-పాటన్ రహదారిపై మూసుకుపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొద్ది దూరంలో ఇలా జరగడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. సహాయక సిబ్బంది రోడ్డుని పునర్నిర్మించే పనిలో పడ్డారు.