Crime: దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ..

Updated on: Sep 08, 2025 | 11:23 AM

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దిగంబర ముఠా మహిళలపై దాడులు చేస్తోంది. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక దాడులు జరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం ...

ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో దిగంబర ముఠా మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గ్రామస్థుల చెబుతున్న వివరాల ప్రకారం, ఈ ముఠా గత కొన్ని రోజులుగా నగ్నంగా తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలపై దాడులకు పాల్పడుతోంది. భారాల గ్రామంలో ఒక మహిళను పొలాల్లోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నించిన సంఘటన ఇటీవల జరిగింది. బాధితురాలు కేకలు వేయడంతో ముఠా పారిపోయింది. ఇదే విధంగా ఇతర దాడులు కూడా జరిగాయని గ్రామస్థులు తెలిపారు. ముగ్గురు మహిళలు ఇలాంటి దాడులను ఎదుర్కొన్నప్పటికీ, భయం, అవమానంతో బయటకు చెప్పలేకపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో గాలిలో చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.