AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు విధింపు!

విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు విధింపు!

Samatha J
|

Updated on: Oct 12, 2026 | 12:55 PM

Share

అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కింద పనిచేయడానికి యూనివర్సిటీలు ఒక్కో విద్యార్థికి 70,000 డాలర్ల భారీ ఫీజు చెల్లించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. దీనితో పాటు హెచ్-1బీ వీసా నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ఈ మార్పులు అంతర్జాతీయ విద్యార్థులకు, ఐటీ రంగానికి సవాళ్లను విసురుతున్నాయి.

అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం తీవ్ర ఆంక్షలకు సిద్ధమైంది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) కార్యక్రమం కింద పనిచేసేందుకు గాను యూనివర్సిటీలు ప్రతి విద్యార్థి తరపున భారీ ఫీజు చెల్లించాలనే కొత్త నిబంధనను ప్రతిపాదించింది.తాజా ప్రతిపాదన ప్రకారం, ఓపీటీ సేవలకు గాను విశ్వవిద్యాలయాలు ఒక్కో విద్యార్థికి 70,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 58 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్రోగ్రాం రెన్యూవల్ లేదా పొడిగింపు కోసం అదనంగా మరో 30,000 డాలర్లను వసూలు చేయాలని డీహెచ్ఎస్ ప్రతిపాదించింది. చవకైన శ్రామిక శక్తిని అడ్డుకోవడమే ఈ భారీ ఫీజుల ఉద్దేశ్యమని డీహెచ్ఎస్ పేర్కొంది. దీనిపై 60 రోజుల ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.మరోవైపు, హెచ్-1బీ వీసా నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యల కోసం “హెచ్-1బీ వీసా ఫ్రాడ్ క్రాక్ డౌన్ యాక్ట్” పేరిట ఒక కొత్త బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

 

Follow Us