Telangana: కదిలిస్తే కన్నీళ్లు.. ఎటు చూసిన తోపులాటలు.. యూరియా కోసం అన్నదాతల ఆందోళన..
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడెక్కారు. మరిపెడలో రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామయంపేట్ పీఏసీఎస్ కార్యాలయం ముందు ఉదయం 5గంటల నుంచే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కదిలిస్తే కన్నీళ్లు.. ఎటు చూసిన తోపులాటలు.. యూరియా కోసం సొసైటీల దగ్గర పడిగాపులు.. వర్షంలో తడుస్తూ జాగారాలు.. ప్రభుత్వాలు అదిగో ఇదిగో అనడం తప్ప రైతులకు యూరియా మాత్రం అందించడం లేవు. జనగామ జిల్లా పాలకుర్తిలో అర్థరాత్రి నుంచే సొసైటీ దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడెక్కారు. మరిపెడలో రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామయంపేట్ పీఏసీఎస్ కార్యాలయం ముందు ఉదయం 5గంటల నుంచే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Sep 01, 2025 10:18 PM
