వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రూల్స్ తెలియకపోతే మీ జేబుకు చిల్లే!
తెలంగాణలో వాహనదారులు తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ వివరాలను VAHAN పోర్టల్‌లో వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కొత్త నిబంధనల ప్రకారం పోర్టల్‌లో నమోదైన వివరాలకు పంపిన ఈ-చలాన్లు అధికారికంగా అందినట్టే పరిగణిస్తారు. నోటిఫికేషన్ చూడకపోయినా జరిమానా చెల్లింపు బాధ్యత వాహన యజమానిదే. దీంతో ట్రాఫిక్, ట్యాక్స్, ఫిట్‌నెస్ వంటి కీలక సమాచారం సకాలంలో అందుతుంది.
తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మీ వాహనానికి సంబంధించిన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలు, నోటీసులు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో అందుకోవాలంటే వెంటనే VAHAN పోర్టల్‌లో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని హైదరాబాద్ CP సజ్జనార్. డీమ్డ్ సర్వ్ నిబంధన అమలులోకి వచ్చాక, నోటిఫికేషన్ అందకపోయినా చలాన్ చెల్లింపు బాధ్యత వాహన యజమాని మీదే ఉంటుందన్నారు. రాష్ట్రంలోని వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ చలాన్‌ల సమాచారం ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరేందుకు రాష్ట్ర రవాణా శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ట్రాఫిక్ చలాన్‌ల సమాచారం నేరుగా మొబైల్‌కు రావాలంటే.. వాహనదారులు తప్పకుండా తమ వ్యక్తిగత వివరాలను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా పోస్టు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ‘వాహన్’ పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్టుగానే పరిగణిస్తారు. కాబట్టి అలసత్వం వహించకుండా వెంటనే మీ వివరాలను అప్ డేట్ చేసుకోండి. సమాచారం తెలుసుకుంటూ జరిమానాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి” అని సీపీ సజ్జనార్ తన పోస్టులో ప్రస్తావించారు. తెలంగాణ రవాణా శాఖ జూన్ 1, 2026న జారీ చేసిన GO No.25 ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వాహనాల యజమానులూ తమ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను VAHAN పోర్టల్‌లో 30 రోజుల్లోగా తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ తర్వాత, పోర్టల్‌లో నమోదైన సంప్రదింపు వివరాలకు SMS, WhatsApp లేదా ఈ-మెయిల్ ద్వారా పంపిన ట్రాఫిక్ ఈ-చలాన్లు వాహన యజమానికి అధికారికంగా చేరినట్టు పరిగణిస్తారు. ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సహా రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ చేస్తున్న ముఖ్యమైన డిజిటల్ చర్య. ఈ కొత్త నిబంధన వల్ల వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు, ఫిట్‌నెస్, ట్యాక్స్, పెర్మిట్ వంటి కీలక సమాచారాన్ని సకాలంలో అందుకోవచ్చు. ప్రస్తుతం చాలా మంది వాహనదారుల పాత మొబైల్ నంబర్లు లేదా ఈ-మెయిల్‌లు VAHAN డేటాబేస్‌లో ఉండటం వల్ల నోటిఫికేషన్లు అందక, జరిమానాలు పెరిగి పెండింగ్‌లో ఉంటున్నాయి. రూ.1,930 కోట్లకు పైగా ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న కారణంగా.. ఈ చర్య తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. డీమ్డ్ సర్వ్ నిబంధన అమలులోకి వచ్చాక, నోటిఫికేషన్ అందకపోయినా చలాన్ చెల్లింపు బాధ్యత వాహన యజమాని మీదే ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాన్నా ఒక్క అడుగు ముందుకు వెయ్యి.. దువ్వూరు కుటుంబ విషాదం వెనుక సీసీటీవీ బయటపెట్టిన నిజాలు
నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?
మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్ బేబీస్”
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!
