Kurnool: స్కూల్‌లోని వాటర్ పైప్ నుంచి పెద్ద పెద్దగా శబ్దాలు.. ఏంటా అని మొబైల్ లైట్ ఆన్ చేయగా

Edited By: Ravi Kiran

Updated on: Nov 27, 2025 | 11:26 AM

వరుసగా పాములు కనిపిస్తుండటంతో ఉర్దూ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఏకంగా తరగతి గదిలోకి రావడంతో ఒక్కసారిగా విస్తుపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

కర్నూలు నగరంలోని ఇండోర్ స్టేడియం పక్కన ఉన్న ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని రోజులుగా పాములు వరసగా దర్శనమిస్తున్నాయి. తాజాగా తరగతి గదిలోకి రావడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పాఠశాల హెచ్ఎం.. ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. స్నేక్ క్యాచర్‌కి ఎంఈఓ సమాచారం ఇచ్చారు. వెంటనే వచ్చిన స్నేక్ క్యాచర్ రెండు పాములు పట్టుకున్నారు. జన సంచారం లేని సుదూర ప్రాంతంలో వదిలేశారు. వందలాదిమంది చదువుకుంటున్న ఉర్దూ పాఠశాలలో పాముల సంచారం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

Published on: Nov 27, 2025 11:26 AM