TV9 Seed Ball Campaign: పుడమి తల్లి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం టీవీ9 సీడ్‌బాల్ కార్యక్రమం
మెరుగైన సమాజం కోసం ఎప్పుడూ ముందుండే టీవీ9 నెట్‌వర్క్.. పుడమి తల్లి రక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా సీడ్ బాల్ క్యాంపెయిన్ చేస్తోంది. పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో టీవీ9 సీడ్‌బాల్ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా కొనసాగిస్తోంది.టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్‌లో మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో tv9 ఆద్వర్యంలో సెంటర్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్ సహకారంతో క్యాంపైన్ నిర్వహించారు. చెయ్యి చెయ్యి కలుపుదాం..పచ్చదనాన్నిపరిరక్షిద్దాం అనే నినాదంతో టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ ప్రారంభించింది.
మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో TV9 ఆధ్వర్యంలో సీడ్ బాల్ క్యాంపెయిన్ వర్క్‌షాప్ నిర్వహించారు. సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ సహకారంతో సీడ్ బాల్ క్యాంపెయిన్ జరిగింది. చెయ్యి చెయ్యి కలుపుదాం, పచ్చదనాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో టీవీ9 సీడ్ బాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సీడ్‌బాల్ తయారీ వర్క్‌షాప్‌కు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పర్యావరణం పట్ల చైతన్యం, బాధ్యత పెంచడంపై సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
