నాగమల్లయ్య హత్యపై ట్రంప్‌ రియాక్షన్‌ వీడియో

Updated on: Sep 17, 2025 | 4:32 PM

అమెరికాలో భారత్‌కు చెందిన నాగమల్లయ్య మర్డర్‌పై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. నిందితుడిపై ఫస్ట్‌ డిగ్రీ కింద కేసు నమోదు చేసి విచారణ చేపడతామని హామీ ట్రంప్‌ ఇచ్చారు. అమెరికాను మళ్లీ సురక్షిత దేశంగా మార్చడమే తమ లక్ష్యమని ఆయన వెల్లడించారు. అక్రమ వలసదారులను ట్రంప్‌ మరోసారి హెచ్చరించారు. నేరాలు చేసే వలసదారులపై కఠినంగా ఉంటామన్నారు ట్రంప్‌. చంద్ర నాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికి వచ్చాయన్నారు ట్రంప్‌.

డాలస్‌లో మల్లయ్యకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య, కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది. తమ దేశానికి సంబంధం లేని, క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు’ అని ట్రంప్‌ తన ట్రూత్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. సెప్టెంబర్‌ 10న డాలస్‌లో కుటుంబసభ్యుల ముందే నాగమల్లయ్యను హత్య చేశారు. క్యూబాకు చెందిన యోర్డానిస్‌ కోబోస్‌ మార్టినెజ్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నాగమల్లయ్య తల నరికి మరీ దానికి చెత్తబుట్టలో వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది. నాగమల్లయ్య కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా చేసిన దారుణ హత్య అభియోగాలపై చట్టపరిధిలో వీలైనంత కఠినంగా శిక్షిస్తామన్నారు ట్రంప్‌. అమెరికాలో అక్రమంగా వలసవచ్చిన మార్టినెజ్‌కు – నేరచరిత్ర ఉందని గుర్తుచేశారు ట్రంప్‌. భయంకరమైన నేరాలు, బాలల మీద లైంగిక వేధింపులు, వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు ట్రంప్‌ తెలిపారు. బైడెన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మార్టినెజ్‌ జైలునుంచి విడుదల అయ్యాడని ట్రంప్‌ విమర్శలు గుప్పించారు.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో