Andhra Pradesh: గిరిజనుల ఈ కష్టాలు తీరేదెన్నడు? గుండె తరుక్కుపోయే వీడియో..

Updated on: Oct 01, 2023 | 9:58 AM

Andhra Pradesh: గిరిజనులకు కష్టాలు తీరడం లేదు, అడవి బిడ్డల అవస్థలకు పరిష్కారం లభించడం లేదు. అల్లూరి జిల్లాలో సరైన రోడ్డు, వాహన సదుపాయం లేక ఏకంగా 5 కిలో మీటర్ల మేర డోలి మోసుకెళ్లారు గ్రామస్తులు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయితీలో గిరిజనుల దీనస్థితి ఇది. అనారోగ్యంతో కింటుకూరు గ్రామ గిరిజన మహిళ జీజీహెచ్‌లో మృతి చెందింది.

Andhra Pradesh: గిరిజనులకు కష్టాలు తీరడం లేదు, అడవి బిడ్డల అవస్థలకు పరిష్కారం లభించడం లేదు. అల్లూరి జిల్లాలో సరైన రోడ్డు, వాహన సదుపాయం లేక ఏకంగా 5 కిలో మీటర్ల మేర డోలి మోసుకెళ్లారు గ్రామస్తులు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయితీలో గిరిజనుల దీనస్థితి ఇది. అనారోగ్యంతో కింటుకూరు గ్రామ గిరిజన మహిళ జీజీహెచ్‌లో మృతి చెందింది. అయితే డెడ్‌బాడీని సొంతింటి తరలించేందుకు రోడ్డు, వాహన మార్గం లేక ఇలా మృతదేహన్ని 5 కిలోమీటర్లు మేర డోలితో మోసుకెళ్లారు గ్రామస్తులు. డెడ్‌బాడీని రంపచోడవరం నుంచి బేస్ క్యాంప్ దగ్గరకు అంబులెన్స్‌లో తరలించి అక్కడ దించేశారు. కింటుకూరు గ్రామానికి రోడ్ మార్గం లేకపోవడంతో డోలిలో మోసుకెళ్లారు గ్రామస్థులు. రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ నుంచి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్నా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.