పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు.. ఇమ్యూనిటీని పెంచుకోండి ఇలా !!

|

Jan 14, 2025 | 3:19 PM

క‌రోనా.. 2019లో వూహాన్‌లో పుట్టి ఊహించని విధంగా ప్రపంచాన్ని చుట్టేసింది. దీని ప్రభావం ఒక్క ఆరోగ్యం పైనే కాదు... అన్ని రంగాలపైనా పడింది. ఇప్పుడిప్పుడే దీనిని లైట్‌ తీసుకుంటున్నారో లేదో.. మళ్లీ తన ప్రతాపం చూపడం మొదలుపెట్టేసింది. చైనాలో కొత్తగా హ్యూమ‌న్ మెటాన్యూమో వైర‌స్ వ్యాప్తి చెందుతుండ‌డంతో అక్కడ హాస్పిట‌ల్స్ అన్నీ కిక్కిరిసిపోతున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేశాలు అల‌ర్ట్ అయ్యాయి. ఇక భార‌త్ లోనూ హెచ్ఎంపీ వైర‌స్‌కు చెందిన కేసులు 7 న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రాల‌ను అప్రమ‌త్తం చేసింది. అయితే ఈ కొత్త వైర‌స్ కూడా క‌రోనా లాంటి ల‌క్షణాల‌ను క‌లిగిఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే ఇందుకు గాను మెడిసిన్స్‌ వాడుతున్నా సరే.. ఇంట్లో స‌హ‌జ‌సిద్ధంగా ల‌భించే ప‌దార్థాల‌తోనే ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను రెండింత‌లు పెంచుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే సీజ‌న‌ల్ పండ్లతోపాటు ఇత‌ర పండ్లను కూడా తినాలి. ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన సిట్రస్ పండ్లను ఎక్కువగా తినాలి. నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, బెర్రీ పండ్లు, క్యాప్సికం వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిల్లో విట‌మిన్ సి స‌మృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించి ఊపిరితిత్తుల క‌ణ‌జాలాన్ని రక్షిస్తాయి. దీంతో హెచ్ఎంపీ వైర‌స్ నుంచి ర‌క్షణ ల‌భిస్తుంది. వ్యాధి రాకుండా జాగ్రత్త ప‌డ‌వ‌చ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్​ చేయాలి

అబ్బాయిలూ ఇలా రెడీ అవండి.. చాలా స్పెషల్‌గా కనిపిస్తారు..