శ్రీవారి భక్తుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు

Updated on: Dec 31, 2025 | 8:31 PM

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లే భక్తుల కోసం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. శ్రీవారి మెట్టు మార్గంలో ఇప్పటికే ఇలాంటి కేంద్రం ఉందని, భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఛైర్మన్ స్పష్టం చేశారు.

అలిపిరి మెట్ల మార్గంలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ బీఆర్‌ నాయుడు మీడియాతో .. నడకదారి ద్వారా తిరుమల చేరుకునే భక్తుల సౌకర్యార్థం ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఇప్పటికే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేసామని, భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కనిగిరికి రైలు.. సాకారమైన 30 ఏళ్ళ కల

ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి

చలి గుప్పిట్లో తెలంగాణ.. నెల రోజులుగా వణుకే..

ATM: ఇక.. ఏటీఎంలు కనుమరుగేనా

ధోనీ కారులో అది చూసి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్