Hyderabad: గాంధీభవన్లో తమ గోడు వెల్లబుచ్చిన టిబెట్ ఎంపీలు..
చైనా ఆక్రమించిన టిబెట్ భూభాగం విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని టిబెట్ ఎంపీలు కాంగ్రెస్ నేతలను కోరారు. చైనా ఆక్రమిత ప్రాంతంలో తమకు కనీస హక్కులు, పత్రిక స్వేచ్చ లేదని అవేదన వ్యక్తం చేశారు. టిబెట్ ఎంపీలు హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇంచార్జీ దేపాదాస్ మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు.
చైనా ఆక్రమించిన టిబెట్ భూభాగం విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని టిబెట్ ఎంపీలు కాంగ్రెస్ నేతలను కోరారు. చైనా ఆక్రమిత ప్రాంతంలో తమకు కనీస హక్కులు, పత్రిక స్వేచ్చ లేదని అవేదన వ్యక్తం చేశారు. టిబెట్ ఎంపీలు హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇంచార్జీ దేపాదాస్ మున్షీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్‌తోపాటు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కలిశారు. చైనా ఆక్రమిత టిబెట్‌లో తమకు మాట్లాడే హక్కులేదని తమ పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితులుగా ఉన్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. టిబెట్ ఎంపీల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..