Hyderabad: ఆటోలో అనుమానంగా ముగ్గురు మహిళలు.. ఆమెను పట్టుకుని కట్టేయగా.. ఆ తర్వాత
ఓ అపార్ట్‌మెంట్ దగ్గర ఆటో చుట్టూ తిరుగుతోంది. అందులో ముగ్గురు ఆడవాళ్లు ఉన్నారు. స్థానికులకు అనుమానమొచ్చి చెక్ చేయగా.. ఇద్దరు మహిళలు తప్పించుకున్నారు. ఒకరు దొరికిపోయారు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ సారి లుక్కేయండి.
పిల్లలను అపహరించే గ్యాంగుకు దేహశుద్ధి చేశారు స్థానికులు. ఈ ఘటన కొండాపూర్‌లో చోటు చేసుకుంది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్‌లో వాచ్‌మెన్ పిల్లలను టార్గెట్ చేసుకుని ఎత్తుకుని వెళ్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు స్థానికులు. ఈ ముఠాలో ముగ్గురు సభ్యులు ఉండగా.. అందులో ఇద్దరు ఆటోలో తప్పించుకున్నారు. మరొకరు దొరికారు. ఇక ఆమెను స్తంభానికి కట్టేసి కొట్టి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు స్థానికులు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.