Telangana Rising Global Summit 2025: అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోంది: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. సోనియా, మన్మోహన్ సారథ్యంలో తెలంగాణ కల సాకారం అయిందని.. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని తెలిపారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకున్నామని.. ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట నిర్వహిస్తున్న మెగా ఈవెంట్ ఘనంగా ప్రారంభమైంది.. హైదరాబాద్‌ను మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా ప్రొజెక్ట్ చేయడంతోపాటు.. ఫ్యూచర్ సిటీని గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది.. విశ్వనగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడగలదని చూపే సంకల్పంతో రేవంత్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.. 2047 టార్గెట్‌గా తెలంగాణ అభివృద్ధిపై స్పెషల్ రోడ్‌మ్యాప్ సిద్ధం చేసిన రేవంత్ ప్రభుత్వం.. 22 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో చర్చించేలా ఏర్పాట్లు చేసింది.. రేపు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమిట్ వేదికగా గడిచిన రెండేళ్ల ప్రయాణంపైనా విశ్లేషణ జరగనుంది.