మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా
తెలంగాణలో మహిళల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం ద్వారా 251 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు. ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆధార్ కార్డుకు బదులుగా త్వరలో స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. ఇది మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.
తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అందించింది రేవంత్ సర్కార్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతానికికైనా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం లభించింది. దీంతో ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆర్టీసీకి కూడా దీని వల్ల లాభం చేకూరుతోంది. ఈ పధకం ప్రారంభించి రెండేళ్లు ముగిసిన క్రమంలో ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త అందించింది. ఇకపై అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఈ సౌకర్యం ఉందని, భవిష్యత్తులో తీసుకురానున్న అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే త్వరలో ప్రభుత్వం ఇందులో మార్పులు చేయనుంది. మహిళలకు ఒక స్మార్ట్ కార్డును అందించనుంది. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఆధార్ కార్డు విషయంలో బస్సుల్లో మహిళలు, ఆర్టీసీ సిబ్బంది మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో స్మార్ట్ కార్డ్ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. త్వరలోనే ఈ కార్డులను జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా ఈ స్మార్ట్ కార్డు ఉపయోగించి మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. 2023 డిసెంబర్ 9న ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఉచిత బస్సు సౌకర్యం అందబాటులోకి వచ్చాక దేవాలయాల సందర్శన పెరిగిందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tirumala: తిరుమల శ్రీవారికి భక్తురాలు కోటి విరాళం..
కారును ఢీకొన్న విమానం.. ఫ్లోరిడా రోడ్డుపై షాకింగ్ ఘటన
Akhanda 2 Review: లాజిక్స్ లేవమ్మా.. అన్నీ గూస్ బంప్సే!’ అఖండ2 మూవీ రివ్యూ