Watch: అటు హైడ్రా అంటే హడల్.. ఇటు సపోర్ట్‌గా ర్యాలీ.. వీడియో చూశారా..

|

Aug 25, 2024 | 9:24 PM

హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలామంది హడలిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆక్రమణల తొలగింపు పర్వాన్ని హైడ్రా గత కొన్ని వారాల ముందు నుంచే చేపట్టగా.. హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది.

హైడ్రా.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలామంది హడలిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. ఆక్రమణల తొలగింపు పర్వాన్ని హైడ్రా గత కొన్ని వారాల ముందు నుంచే చేపట్టగా.. హీరో నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా కూల్చివేయడంతో ఇప్పుడు అందరి దృష్టి దీనిపైనే ఉంది. రాజకీయ పార్టీలు కూడా విభిన్న రీతిలో దీనిపై స్పందిస్తున్నాయి. కాగా  హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు తమ కట్టడాలు కూల్చేస్తాయో అని హైదరాబాద్‌లోని చాలా మంది టెన్షన్ పడుతున్నారు. హైడ్రాతో ప్రభుత్వం పొలిటికల్ గేమ్ ఆడుతోందని విపక్షాలు విమర్శిస్తుంటే.. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. తగ్గేదేలే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు. అటు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు కొన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది.

హైడ్రాకు మద్దతుగా గండిపేట వెల్ఫేర్ సొసైటీ సపోర్ట్ వాక్ నిర్వహించింది. ఈ సపోర్ట్ వాక్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ప్రజలు మద్దతు తెలిపారు. ఈ వాక్‌లో భారీగా స్థానికులు, విద్యార్థులు, యువత, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. చెరువులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మనది హైడ్రా మనందరిదీ అనే నినాదాలు చేశారు.

Follow us on