Telangana Elections: అమ్మ బాబోయ్ అవి నోట్ల కట్టలు కాదు.. గుట్టలే.. బంజారాహిల్స్‌లో భారీగా పట్టుబడిన నగదు..

|

Oct 11, 2023 | 8:59 AM

Telangana Elections: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్‌ లో కారులో తరలిస్తున్న 3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటకు వస్తన్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. బంజారాహిల్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కారులో..

Telangana Elections: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీగా నగదు, బంగారం పట్టుబడుతుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి.. తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. హైదరాబాద్‌ లో కారులో తరలిస్తున్న 3కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలుతో తెలంగాణలో నోట్ల కట్టలు గుట్టలుగా బయటకు వస్తన్నాయి. పోలీసుల తనిఖీల్లో నోట్ల కట్టల కోట్ల మోత మోగుతోంది. బంజారాహిల్స్‌లో గుట్టు చప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న రూ. 3.35 కోట్ల నగదు స్వాధీనం సుకున్నారు పోలీసులు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అలాగే హైదరాబాద్‌లోనే మరో చోట 12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను ముమ్మర తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఇదేక్రమంలో నల్గొండ జిల్లా అనుములలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ. 30 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్టు గుర్తించారు. మిర్యాలగూడలో రూ.3.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో వాహన తనిఖీల్లో 6.55 లక్షల రూపాయలను ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హబీబ్ నగర్‌లో 17 లక్షలు సీజ్‌ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన మూడు రోజుల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. ఇప్పటి వరకు 15 కిలోల బంగారం, 400 కిలోల వెండి సీజ్‌ చేశారు. ఎన్నికల కోడ్‌ వేళ పాతబస్తీలో అర్థరాత్రి పోలీసులు కార్డన్‌ సర్చ్‌ నిర్వహించారు. పలుచోట్ల బెల్ట్ షాపులను గుర్తించారు. భారీగా మద్యం స్వాదీనం చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Published on: Oct 11, 2023 08:52 AM