WITT 2026: ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 నెట్‌వర్క్ What India Thinks Today సమ్మిట్‌లో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
W..I..T..T .. వాట్ ఇండియా థింక్స్ టుడే.. ఇండియా ఏం ఆలోచిస్తోంది?.. సగటు భారతీయ పౌరుడి మన్‌కీ బాత్‌ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఢిల్లీలో టీవీ9 వేదికగా ప్రతిష్టాత్మక సదస్సు జరుగుతోంది.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు.. పాల్గొని.. పలు కీలక అంశాలపై ప్రసంగిస్తున్నారు. ఢిల్లీలో జరుగుతున్న టీవీ9 నెట్‌వర్క్ What India Thinks Today సమ్మిట్‌లో మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన బిగ్ విజన్ తెలంగాణ 2047పై కీలక విషయాలు పంచుకోనున్నారు.
డబ్ల్యూఐటీటీ వేదికగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ మంచి చేస్తే మంచి చేశారని చెబుతా.. తప్పు చేస్తుంటే తప్పని చెబుతానని అన్నారు. ప్రజల సమస్యల ఆధారంగా ఆరు గ్యారెంటీలు ఇచ్చామని.. అవి కచ్చితంగా అమలు అయ్యేలా చూస్తున్నామని అన్నారు. పేదరికం చూస్తూ పెరిగిన వాడినని.. బెంజి కారులో వెళ్ళి దళితుల ఇళ్లలో స్విగ్గి ఫుడ్ బిజెపి వాళ్ళు తింటున్నారని మండిపడ్డారు. ఆర్థిక వనరులు తక్కువ ఉండటం వల్ల కొన్ని గ్యారెంటీలు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి అనుకున్న దానికంటే అధిక అప్పులు ఉన్నాయని తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్ పేపర్ విడుదల చేశామన్నారు. 11.90 వడ్డీకి 2 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని దుయ్యబట్టారు. 6-7 శాతం వడ్డీ వదిలేసి అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. నచ్చితే నజరానా నచ్చకపోతే జరిమానా అన్నట్లుగా గత ప్రభుత్వ వైఖరి ఉండేది. ఇచ్చిన హామీల గురించి ప్రజలకు తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నా.. సోలార్ ఎనర్జీ ద్వారా దేశాన్ని కాపాడాలని ప్రతి రోజు సూర్య భగవానుని ప్రార్థిస్తున్నానని.. బంగ్లాదేశ్, శ్రీలంక, చైనా, అమెరికా ఏ దేశం కూడా భారతతో లేదు. విదేశాలతో భారతకి మంచి సంబంధాలు లేకుండా పోయాయని వెల్లడించారు.
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..

