కరువును కలిసికట్టుగా ఎదుర్కొందాం…
ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో తలెత్తే కరువు, నీటి కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర సాయం కోరాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీలో BRS, BJP సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ చర్యలపై విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తగా, నీటి కొరత అన్ని రాష్ట్రాల్లో ఉందని మంత్రులు పేర్కొన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల పరిహారం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కేంద్ర సాయం కోరాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. తెలంగాణలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని విపక్షాలు విమర్శించాయి. మరోవైపు నీటి కొరత అన్ని రాష్ట్రాల్లో ఉందన్న మంత్రులు ఎల్‌నినోను కలిసికట్టుగా ఎదుర్కోందామని పిలుపునిచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎల్‌నినోపై అఖిలపక్ష సమావేశం జరిగగింది. ఈ సమావేశానికి BRS, BJP, CPI, CPM, MIM, TJS నేతలు హాజరయ్యారు. ఎల్‌నినో పరిస్థితులపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి ప్రతిపక్షాలు. సీఎం సమావేశానికి రాకపోవడం సరికాదన్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణాగోదావరి నీటిని విడిచిపెడతే ఏపీ ప్రభుత్వం ఒడిసిపట్టిందన్నారు. ఎల్‌నినో ప్రభావం అన్ని రాష్ట్రాలపై ఉన్నా ఒక్క తెలంగాణ మాత్రమే క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ ప్రణాళిక లేదని విమర్శించారు బీజేఎల్పీ నేత మహేశ్వ్ రెడ్డి. రైతులకు ఎకరాకు 15వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే తాగునీటి కష్టాలొచ్చాయన్నారు విపక్ష నేతలు. హైదరాబాద్‌లో నీటికొరత ఎందుకు వచ్చిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది MIM . ప్రజలకు రేషన్ షాపుల్లో నిత్యవసరాలు ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. నీటి కొరత అన్ని రాష్ట్రాల్లో ఉందన్నారు మంత్రులు. ఎల్‌నినోను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఈ విపత్తు సమయంలో కేంద్ర సాయం కోసం ఢిల్లీ వెళ్లాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు కేంద్ర సాయం కోరాలని అఖిలపక్షం నిర్ణయం
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరు కొనేవన్నీ సన్నబియ్యమేనా..
తెలంగాణ ప్రభుత్వ కొత్త విప్లవం! ప్రభుత్వ పాలనలో ‘ఏఐ సాక్షమ్’
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. KBR తరహాలో మరో వన్-వే లూప్.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఏపీలో పన్నీర్ బ్యాన్! హోటళ్లు, రెస్టారెంట్లలో ముమ్మర తనిఖీలు!